ChatGPT ని ఓవర్టేక్ చేసిన ఎలాన్మస్క్ Grok

ChatGPT ని ఓవర్టేక్ చేసిన ఎలాన్మస్క్ Grok

ఎప్పుడొచ్చామని కాదన్నయా.. బుల్లెట్ దిగిందా లేదా అనే మ్యాటర్..అని పోకిరి సినిమాలో డైలాగ్ గుర్తుకొస్తుంది ఎలాన్ మస్క్ AI చాట్ బాట్ Grokని చూస్తే..ప్రారంభించి ఏడాది కూడా కాలేదు.. అప్పుడు టాప్ పోజిషన్ లోకి దూసుకొచ్చింది. Grok ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మొదటి చాట్బాట్ అయిన Open AI ChatGPTని దాటేసింది. ఇక తన చాట్బాట్లో టాప్లోకి రావడంతో ఎలాన్ మస్క్ సంబరాలు చేసుకుంటూ Xలో పోస్ట్ చేశారు.    

టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ ఇటీవల xAI ద్వారా AI చాట్‌బాట్ అయిన గ్రోక్ ఆండ్రాయిడ్‌లో నంబర్ వన్ యాప్‌గా మారిందని ప్రకటించారు. టెక్ బిలియనీర్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ Xలో ఈ విషయాన్ని షేర్ చేశారు. టాప్ ఫ్రీ కేటగిరీలో నవంబర్1 స్థానంలో ఉన్న గ్రోక్ యాప్ Google Play స్టోర్ జాబితా స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేశారు. TikTok ,ChatGPTలను అధిగమించింది. ఇవి 4.1,4.8 తక్కువ రేటింగ్ పొందాయి. కూల్ @Grok ఆండ్రాయిడ్‌లో #1! అని మస్క్ పోస్ట్‌లో రాశారు.

Also Read :- DOGE నుంచి తప్పుకుంటున్నాడు..డేట్ ఫిక్స్

2023లో జనరేటివ్ AI గ్రోక్ ని ఎలాన్ మస్క్ ప్రారంభించారు. ఇది ఈమధ్యకాలంలో Grok3తో అప్డేట్ చేశారు. Android కోసం Grok యాప్ ఫిబ్రవరి 2025లో ప్రారంభమైంది. xAI బెంచ్ మార్క్ లలో ఒకటైన OpenAI కి చెందిన GPT40 కంటే మెరుగ్గా పనిచేస్తుందన్నారు ఎలాన్ మస్క్. మస్క్ షేర్ చేసిన స్క్రీన్‌షాట్..USలో యాప్ Play Store జాబితాను చూపుతుంది. US Google Play Store జాబితాను చెక్ చేయడం ద్వారా యాప్ నంబర్ వన్ స్థానంలో ఉందని నిర్ధారించబడింది. 

ఈ పోస్టు ఆండ్రాయిడ్‌లో గ్రోక్ పెరుగుతున్న ప్రజాదరణను ప్రతిబింబిస్తుంది. దీనిపై నెటిజన్ల నుంచి రెస్పాన్స్ మామూలుగా లేదు.  కొంతమంది గ్రోక్ సెర్చింగ్ కెపాసిటీని ప్రశంసించారు. మరికొందరు గ్రోక్ తో ఎదుర్కొంటున్న సమస్యలు, దురాక్రమణను విమర్శిస్తున్నారు.