
హిందూ సంప్రదాయం.. భారతీయుల పెళ్లి వేడుకలు ఆడండరంగా జరుగుతాయి. పేదవారైనా.. ధనవంతులైనా.. సంబరంగా చేస్తారు, హిందువుల పెళ్లిళ్ల ఖర్చు వధువు కుటుంబం భరిస్తుంది. పెళ్లంటే స్టేజీ డెకరేషన్...హంగు ఆర్భాటం.. భోజనాలు.. పెళ్లికి వచ్చిన వారికి మర్యాదలు ఇలా ఒకమేటిటి పెళ్లి తతంగమంతా హడావిడిగానే ఉంటుంది. అయితే తాజాగా ఓ పెళ్లిలో భోజనం సమస్యతో వివాహం క్యాన్సిల్ అయింది.
పెళ్లికొడుకు పెళ్లిని గ్రాండ్ గా చేయాలని.. పెళ్లికి వచ్చిన 600 మంది అతిథులకు మటన్ బిర్యానీతో విందు ఏర్పాటు చేయాలని కోరాడు. అయితే వధువు తండ్రి తనకు అంత ఆర్థిక స్థోమత లేదని .. దీనికి 10 నుంచి 15 లక్షలు ఖర్చు అవుతుందని.. చెప్పడంతో .. అప్పు చేసి పెళ్లి చేయమని కోరాడు. అలా చేయనని చెప్పడంతో ఆ పెళ్లి కొడుకు పెళ్లిని క్యాన్సిల్ అని చెప్పేసి వెళ్లిపోయాడు.
ఈ విషయాన్ని సోషల్ మీడియాలో రెడ్డిడ్ ప్లాట్ ఫాంలో ఒక యూజర్ రాసుకొచ్చారు. వరుడి కుటుంబం ఇలా చేయడం న్యాయమేనా అని ప్రశ్నించాడు. ఆ రెండు కుటుంబాలు ముస్లిం కమ్యూనిటీకి చెందినవి. వారి ఆచారాల ప్రకారం ఉంగరం.. బట్టలు పెట్టుకోవాలి. ఆతతంగం కూడా పూర్తి అయింది. మే నెల 4వ తేదీన పెళ్లి ఖరారు చేసుకున్నారు. వారి గ్రామంలో పెళ్లి తతంగాన్ని రెండు విధాలుగా చేస్తారు.
ఒక పద్దతి ప్రకారంగా గ్రాండ్గా పసందైన విందు.. చాలా రకాల వెరైటీలతో మటన్బిర్యానీ.. ఇంకా వరుడి కుటుంబం కోరిన వంటకాలతో విందు ఏర్పాటుచేయడం. దీనికి లక్షల మేరకు ఖర్చవుతుంది. ఇదంతా సంపన్నవర్గాలు.. ధనవంతుల ఇండ్లలో జరిగే పెళ్లి.. ఇక మధ్యతరగతి.. పేదవారి పెళ్లిళ్లు టీ, కాఫీలు, స్నాక్స్ ,, పెళ్లికి వచ్చిన బంధువులకు భోజనాలు పెట్టాలి. ఈ ఖర్చంతా వధువు కుటుంబం... వరుడి కుటుంబం షేర్ చేసుకోవాలి. ఈపెళ్లి రెండవ పద్దతిలో పెళ్లి చేయడానికి ముందు ఒప్పందం చేసుకున్నారు. ఈ కండీషన్ కు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. ఒకటి.. గ్రాండ్ గా మటన బిర్యానీ పెట్టి రూ.10 నుంచి రూ.15 లక్షలు ఖర్చు చేయాలి. లేదా రెండో విధానం.. సాయంత్రం టీ, కాఫీలు, స్నాక్స్ పెట్టి పెళ్లి చేయడం..ఇలా చేస్తే మధ్యాహ్నం వచ్చే బంధువులకు మాత్రం భోజనాలు పెట్టాలి.ఆ ఖర్చులు కూడా ఇరువైపులా భరించాలి.
మటన్ బిర్యానీ పెట్టనందుకు వరుడి కుటుంబం పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందించారు. చాలామంది వధువు కుటుంబానికి మద్దతు తెలిపారు. ఈ పెళ్లి రద్దు అవడమే మంచిది. ఇప్పుడు ఇలా మీతో డబ్బు ఖర్చు పెట్టిస్తే .. తరువాత ఆ అమ్మాయిని వేధిస్తే అప్పుడు మీరు ఏమి చేసేవారని రాశారు. మరొకరు ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలని రాశారు. ఇంకొకరు బంధువులు, సమాజం గురించి ఆలోచించకండి.ఈ షాక్ నుంచి బయటపడటానికి ఆ అమ్మాయికి కొంత సమయం ఇవ్వండి. కొంతకాలం తరువాత మంచి భర్తను వెతకండి అని రాసుకొచ్చారు. మరొక వ్యక్తి.. ఈ అబ్బాయికి లడ్డూలు పంపించి కృతఙ్ఞతలు తెలపండి.. విడాకుల జీవితం కంటే చెడిపోయిన నిశ్చితార్దమే మంచిదంటూ.. పార్టీ చేసుకొని ఈ గందరగోళం నుండి బయటపడండి అని రాసుకొచ్చారు.