మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రేపు (మే12) పెళ్లి పీఠలు ఎక్కాల్సిన పెళ్లి కొడుకు కరెంట్ షాక్ తో మృతి చెందాడు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెంలో జరిగింది.
మే 12వ తేదీన పెళ్లి చేసుకోబోతున్న భూక్య యాకుబ్ అనే యువకుడు ఇంట్లో బోరు మోటారు రిపేర్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. రేపే పెళ్లి అనగా.. ఇంతలోనే వరుడు కరెంట్ షాకుతో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కళ్ల ముందే కన్న కొడుకు మృతి చెండదంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మహబూబాబాద్ రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.