ఎంగేజ్మెంట్కు వెళ్తే రిటర్న్ గిఫ్ట్..అతిధులందరికి ఫ్రీగా జ్ఞానం

సాధారణంగా ఎంగేజ్మెంట్ వేడుకకు వెళ్తే..మనం ఏం చేస్తాం. గ్రాండ్ గా తయారై..వధూవరుల కోసం ఎదైనా గిఫ్ట్ తీసుకెళ్తాం. ఎంగేజ్మెంట్ లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించి.. బహుమతులు ఇచ్చి వస్తాం.  కానీ ఇక్కడ డిఫ్రెంట్ గా వచ్చిన అతిథులకు రిటర్న్ గిఫ్ట్ లు ఇచ్చాడు పెళ్లి కొడుకు. పూలు పండ్ల వేడుకలో పాల్గొంటే ప్రత్యేక బహుమతులను ఇచ్చి ఖుషీ చేశాడు.

మంచిర్యాల జిల్లా కొండాపూర్ యాపా గ్రామానికి చెందిన  ఎంబాడి ప్రశాంత్ వర్మ పెళ్లి నిశ్చయమైంది.  సెప్టెంబర్ 8వ తేదీన ఘనంగా ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే ఈ వేడుకలకు తన బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో పాల్గొన్న బంధువులు, స్నేహితులకు ప్రశాంత్ సర్ ప్రైజ్ గిఫ్టులు అందజేశాడు. వేడుకకు వచ్చిన వారందరికి భగవద్గీతలను ఇచ్చాడు. తనకు కాబోయే భార్య బరువుకు సమానంగా త్రాసులో భగవద్గీత పుస్తకాలను తూకం వేసి వాటిని అతిధులందరికి పంచి పెట్టాడు. ఆ భగవద్గీత పుస్తకాలతో పాటు..అందులో తన వివాహా ఆహ్వాన పత్రికను కూడా ముద్రించడం విశేషం. 

ALSO READ :విమోచన దినోత్సవాలను అధికారికంగా ఎందుకు జరపడం లేదు? : కిషన్ రెడ్డి 

ఎందుకీ గిఫ్ట్..

ఎంగేజ్మెంట్ లో ఎందుకు ఇలా భగవద్గీతలను గిఫ్ట్ లు ఇస్తున్నారని వరుడు ప్రశాంత్ ని అడిగితే.. తన పెళ్లి వేడుకులకు వచ్చే అతిధులందరికి  ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించాలనే లక్ష్యంతో ఇలా భగవద్గీతలను అందిస్తున్నానని తెలిపాడు. పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని సమాజంలో అందరికీ పంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టానని చెప్పాడు.  ప్రజలకు గీతా జ్ఞానాన్ని అందించడానికి తన ఎంగేజ్ మెంట్ ఒక ఫ్లాట్ ఫాంగా భావించానని ప్రశాంత్ తెలిపాడు.  సమాజంలో మంచితనాన్ని పెంపొందించేందుకు ఈ పుస్తకం అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నాడు.  ఈ రోజుల్లో చాలా మంది ఆధ్యాత్మిక చింతనకు దూరం అవుతున్నారు... కాబట్టి ఇలా గిఫ్ట్ రూపంలో అయినా భగవద్గీతను అందిస్తే.. అందులో ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటారని ప్రశాంత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 

ఎక్కడ ముద్రించారంటే..

ఈ భగవద్గీత కాఫీలను ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లోని ప్రముఖ గీతా ప్రెప్ లో ముద్రించామని ప్రశాంత్ తెలిపాడు. ఒక్కొక్కటి 1.250 గ్రాముల బరువు ఉన్న 110 కాపీలను ఆర్డర్ చేశామని చెప్పారు.

 

 రాజమండ్రిలోని సెంట్రల్ టుబాకో రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో సీనియర్ రీసెర్చ్ ఫెలోగా పనిచేసే ప్రశాంత్.. రెండు దశాబ్దాలుగా యోగా సాధన చేస్తున్నాడు. అంతేకాకుండా ఎంతో మందికి భగవద్గీతా బోధనలు చేస్తున్నాడు.