ఆయిల్​ ట్యాంకర్​ బోల్తా.. ట్రాఫిక్​లో చిక్కుకున్న పెండ్లికొడుకు

వరంగల్‌‌, వెలుగు: వరంగల్ జిల్లా ఇల్లంద వద్ద గురువారం ఉదయం ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో పోలీసులు రోడ్డుకు ఇరువైపులా వెహికల్స్ ఆపేశారు. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ​స్తంభించింది. అందులో కొద్దిసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ వరుడు చిక్కుకున్నాడు. వరంగల్ నుంచి తొర్రూరుకు వెళ్లాల్సి ఉండగా ఇల్లంద వద్ద వరుడి కారు ట్రాఫిక్ లో ఆగింది. 

ఉదయం 10 గంటలకు ముహూర్తం ఉండగా, అప్పటికే  9.15 గంటలు కావడం.. మరో 30 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉండడంతో వరుడు టెన్షన్​పడ్డాడు. కారు దిగి లారీ బోల్తా పడిన ప్రదేశానికి వెళ్లాడు. త్వరగా ట్రాఫిక్​క్లియర్​చేయాలని అధికారులను కోరాడు. వేరే వెహికల్​లో వెళ్దాం అనుకుంటున్న టైంలో ట్రాఫిక్​క్లియర్​చేయడంతో ఇన్​టైంలో మండపానికి చేరుకున్నాడు.