పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు.. పెద్దలు.. ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో పెళ్లి వీడియోలు వైరల్గా మారుతున్నాయి. ఏదో ఒక కొత్త ఒరవడిని సృష్టించడం .. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఆనవాయితీగా మారింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీ జిల్లాలో జరిగిన ఓ వివాహం సోషల్ మీడియాలో వైరల్ అయింది. .. వివరాల్లోకి వెళ్తే..
పెళ్లికొడుకు వివాహ వేదికలో రావడం పెళ్లిలో ఒక ముఖ్యమైన ఘట్టం.. బెల్హా గ్రామంలో జరుగుతున్న ఓ పెళ్లిలో వరుడు తన బావమరిది భుజాలపై కూర్చొని వచ్చాడు. అంతేకాదు ఈ పెళ్లి వర్షపు వరదలో జరిగింది. ఈ మధ్య కాలంలో కురిసిన వర్షాల కారణంగా బెల్హా గ్రామం వరద నీటిలో చిక్కుకుపోయింది. అయినా సరే ఎలాగైనా పెళ్లి జరపాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకోవడంతో వరుడిని .. కాబోయే బావమరిది భుజాలపై కూర్చోబెట్టుకొని తీసుకువచ్చాడు. ఈ వీడియో నెటిజన్లకు ఫన్నీగా ఉంది. అలానే పెళ్లికూతురిని ఎత్తుకు రావలసిన పరిస్థితి ఏర్పడింది.
వరుడి బెల్హా సిక్తిహా గ్రామానికి చెందిన దుర్గేష్ కుమార్ కుమారుడు పేరు రామ్ నివాస్. వరుడు తన పెళ్లి కోసం టికునియా నగర్ పంచాయతీలోని బార్సోలా గ్రామానికి వెళ్లాల్సి వచ్చింది.దాదాపు మూడు రోజులుగా బెల్హా గ్రామం నీటిలో మునిగిపోవడంతో రాకపోకలు స్థంభించాయి. గ్రామస్థులు ఈ ప్రాంతంలో తిరిగేందుకు ట్రాక్టర్లు.. పడవలను ఉపయోగిస్తున్నారు. దీంతో వరుడు రామ్ నివాస్ ను తన బావమరిది రామ్ కుమార్ భుజాలపై మోస్తూ బారాత్ ఊరేగింపు చేశారు. అలా బావమరిది భుజాలపై బావగారు ఎంజాయి చేశారు.