కొల్లాపూర్, వెలుగు: త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో మండలంలోని అమరగిరి గ్రామంలో కోదండ రామస్వామి ఆలయ నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న జీయర్ స్వామి చొరవతో తిరుమల తిరుపతి దేవస్థానం వారితో మాట్లాడి ఆదివాసీ చెంచు పెంటల్లో 51 గ్రామాలు ఎంపిక చేసి, పాఠశాల, ఆసుపత్రి, ఆలయ నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా అమరగిరి ఆలయ నిర్మాణం కోసం రూ.10 లక్షలు మంజూరు చేశారని చెప్పారు.
నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచులు ప్రతి గ్రామంలో రామాలయం నిర్మాణం జరగాలని బలంగా కోరుకోవడం వల్లే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టామని తెలిపారు. భరత్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.