డైలీ తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలు అవసరం లేదనుకుంటారు. కానీ, అవి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఉదాహరణకు కొబ్బరి, వేరుశెనగ గింజల్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుందని చాలా మంది వాటికి దూరంగా ఉంటారు. కానీ, ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివంటున్నారు. కొబ్బరి ఎక్కువగా తీసుకునే వాళ్ల చర్మమే కాదు... జుట్టు
కూడా మెరుస్తుంది. అందుకే కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగడం, లేత కొబ్బరిని తీసుకోవడంతోపాటు ఎండు కొబ్బరితో తయారు చేసిన పదార్థాలు ఎక్కువగా
తీసుకోవాలి.
ఎందుకంటే కొబ్బరిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలుంటాయి. ఇవి ముఖ్యంగా పిల్లలకు ఎంతో మంచివి. కాబట్టి వీలైనంత ఎక్కువగా కొబ్బరిని తీసుకోవాలి. అలాగే వేరుశెనగ గింజలు కూడా. కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే వేరుశెనగ గింజలను తీసుకోవాలి. జీడిపప్పు, వేరుశెనగ గింజలు కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవాళ్లకు చాలామంచివి. ముఖ్యంగా మోనోపాజ్ దశలో ఉన్న ఆడవాళ్లకు మరీ మంచిది. అందుకే ఎప్పుడైనా ఆకలైతే చాక్లెట్లు, పేస్ట్రీలు కాకుండా వేరుశెనగ గింజలు బెటర్.