వాన నీటిని కాపాడుకోవాలి : కృష్ణమూర్తి

  •     ప్రాంతీయ భూగర్భజలాల సంచాలకులు కృష్ణమూర్తి

బచ్చన్నపేట,వెలుగు: వర్షపునీటిని పొదుపు చేసినప్పుడే భూగర్భ జలాలు పెరుగుతాయని కేంద్ర భూగర్భ జలవనరుల శాఖ ప్రాంతీయ సంచాలకులు కృష్ణమూర్తి సూచించారు. గురువారం బచ్చన్నపేట మండలంలోని గంగాపూర్​ గ్రామాన్ని కేంద్ర భూగర్భ వనరులశాఖ బృందం సందర్శించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడారు.

వర్షపు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఇండ్ల ఎదుట ఇంకుడు గుంతలు, కాలువలపై చెక్​డ్యామ్​లు, ఉపాధిహాపనుల్లో నీటినిలువ ఉండే ఊటచెరువుల తవ్వుకొని భూగర్భ జలాలు పెంచుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్​బందారం సుశీల , గ్రామీణాభివృధ్ధి క్లస్టర్​ టెక్నికల్​ ఆఫీసర్​ కే శ్రీనువాసురెడ్డి, భూగర్భ జలవనరుల శాఖ సైంటిస్ట్​ రాణి, డాక్టర్​ సుందర్​కుమార్​, మధుసుదన్​ పాల్గొన్నారు.