గ్రూప్ 1 అభ్యర్థుల డిమాండ్లు ఇవే : ఆందోళనకు కారణాలు ఇవే

గ్రూప్ 1 అభ్యర్థుల డిమాండ్లు ఇవే : ఆందోళనకు కారణాలు ఇవే

అక్టోబర్21నుంచి జరగనున్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. నిన్న అశోక్ నగర్ చౌరస్తాలో ఆందోళనకు దిగిన అభ్యర్థులు.. పరీక్షల నిర్వహణపై చర్చించేందుకు ఇవాళ( గురువారం ( అక్టోబర్ 17) హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ తో భేటీ అయ్యారు. 

గ్రూప్స్ 1 అభ్యర్థుల డిమాండ్లు

  • GO 29 రద్దు చేసి పరీక్షలు నిర్వహించాలి.
  • పాత G.O.55 ప్రకారం పరీక్షల నిర్వహణ జరగాలి.
  • పాత నోటిఫికేషన్లో ఇచ్చిన 503 పోస్ట్లలో కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వవద్దు.
  • పెంచిన 60 పోస్టుల్లో  మాత్రమే కొత్తగా అప్లై చేసుకున్న వారికి అవకాశం ఇవ్వాలి.
  • (ప్రభుత్వం కొత్తగా 503 పోస్ట్ ల్లో60 పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇచ్చింది)
  • Go 29 , రిజర్వేషన్ల అంశాల్లో కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని పరిష్కరించి పరీక్షలు పెట్టాలి,
  • పాత నోటిఫికేషన్ ప్రకారమే రిజర్వేషన్లు, ఓపెన్ క్యాటగిరి ప్రకారం పరీక్షలు ఉండాలి.