తెలంగాణలో నేడు గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్ష

తెలంగాణలో నేడు గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్ష

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఆదివారం గ్రూప్1 ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగనుంది. ఉదయం10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం పది గంటలలోపే సెంటర్​కు చేరుకోవాలని, ఆ తర్వాత వస్తే అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.  రాష్ట్రవ్యాప్తంగా 4.03 లక్షల మంది అటెండ్ కానున్నారు.  31 జిల్లాల్లో 897 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

వీటిలో మెజార్టీ సెంటర్లు గ్రేటర్ హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. కాగా, అభ్యర్థులు టీఎస్​పీఎస్సీ వెబ్ సైట్ నుంచి ఏ 4 పేపర్​పై లేజర్ కలర్ ప్రింట్​తోనే హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవాలని, దానిపై లేటెస్ట్ ఫొటో అతికించాలని కమిషన్ అధికారులు సూచించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు గానూ సెంటర్ల వద్ద 144 సెక్షన్ తో పాటు పోలీస్ భద్రతను పెంచారు. 

అభ్యర్థులు తమ వెంట తప్పనిసరిగా ఫొటో ఐడెంటిటీ కార్డు తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. పరీక్ష కేంద్రంలోకి బ్లాక్ / బ్లూ పెన్నులు, హాల్ టికెట్, ఒరిజినల్ ఐడీ కార్డును మాత్రమే అనుమతిస్తారు. పరీక్షకు అటెండ్ అయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ అటెండ్స్ తీసుకోవాల్సి ఉంటుంది.