హైదరాబాద్: గ్రూప్ 1 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ( అక్టోబర్ 18) గ్రూప్1 అభ్యర్థుల తరపున అడ్వకేట్ మోహిత్ రావు సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ త్వరగా జరపాలని చీఫ్ జస్టిస్ బెంచ్ లో స్పెషల్ మోషన్ దాఖలు చేశారు న్యాయవాది మోహిత్ రావు. గ్రూప్ 1 పరీక్షల్లో రూల్ ఆప్ రిజర్వేషన్ ఫాలో కాలేదని.. రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించి పరీక్షలు నిర్వహించాలని పిటిషన్ లో తెలిపారు.
సోమవారం నాడు విచారణ చేపడతామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. మొదటి కేసుగా సోమవారం ఉదయం 11.30 కి విచారణ చేపడతామని చెప్పారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి.