గ్రూప్​-2 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్​ ఆదర్శ్​ సురభి

గ్రూప్​-2 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్​ ఆదర్శ్​ సురభి

వనపర్తి, వెలుగు :  ఈ నెల 15, 16 న నిర్వహించే గ్రూప్​-2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు  కలెక్టర్​ ఆదర్శ్​ సురభి తెలిపారు.  గ్రూప్ 2 అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలని,   12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక  ఒరిజినల్ తీసుకొని రావాలని అన్నారు. ఉదయం   10  నుంచి  12.30లకు,   మధ్యాహ్నం   3  నుంచి  .5.30 వరకు పరీక్షలు ఉంటాయిన తెలిపారు.  

అభ్యర్థులు  ఉదయం 9.30, మధ్యాహ్నం  2.30 కి పరీక్ష కేంద్రాలకు రావాలని, ఒక్క  నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతి ఉండదని అన్నారు.   క్యాండిడేట్స్​ బ్లూ లేదా బ్లాక్ బాల్​ పాయింట్ పెన్ను, హాల్ టికెట్, ఏదైనా గుర్తింపు కార్డు తప్ప మరే విధమైన వస్తువులు పరీక్ష కేంద్రంలోకి తీసుకురాకూడదన్నారు.  సెల్ ఫోన్లు , ఎలక్ట్రానిక్ పరికరాలు, పేజర్స్, టాబ్లెట్స్, పెన్ డ్రైవ్, బ్లూటూత్, గడియారం, గణిత టేబుల్, లాగ్ పట్టికలు, పర్స్, పరీక్ష ప్యాడ్ , నోట్ బుక్స్ లేదా విడి పేపర్లు, ఆభరణాలు, హ్యాండ్ బ్యాగులు, పౌచ్ లు తీసుకొని రావద్దని వాటిని ఎట్టిపరిస్థిల్లోనూ అనుమతించేది
 లేదన్నారు.