- డిసెంబన్ 16న పేపర్ –3, పేపర్ –4
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలో గ్రూప్2 ఎగ్జామ్స్ కు మొదటి రోజు 40 శాతం మంది మాత్రమే హాజరయ్యారు. జిల్లాలో 101 సెంటర్లలో మొత్తం 48,012 మంది అభ్యర్థులు ఎగ్జామ్స్ రాయాల్సి ఉండగా, ఉదయం 19,208(40.01%) మంది, మధ్యాహ్నం 18,879 (39.32%) మంది వచ్చారు. గతంలో గ్రూప్ 1 ఎగ్జామ్స్‌లో కూడా హాజరుశాతం 50 శాతానికి మించలేదు. అప్లై చేసిన వారిలో కొందరు గత ఎగ్జామ్స్‌లో సెలక్ట్ కావడం, మరికొందరు ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధంగా లేకపోవడం, ఇంకొందరు ఎగ్జామ్ సెంటర్స్ కు సమయానికి చేరుకోకపోడంతో హాజరుశాతం తగ్గుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదివారం గ్రూప్ 2 ఎగ్జామ్ సెంటర్ ను ఆకస్మికంగా విజిట్ చేశారు. మెహదీపట్నం సంతోష్ నగర్ సెయింట్ అన్స్ బాలికల జూనియర్ కాలేజీలో ఎగ్జామ్స్ పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.