ములుగు/ జనగామ అర్బన్/ మహబూబాబాద్, వెలుగు: ఉమ్మడి ఓరుగల్లు జిల్లా వ్యాప్తంగా గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం ములుగు జిల్లా వ్యాప్తంగా 9 పరీక్ష కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 2195 మందికి ఉదయం స్టేషన్లో 1102 మంది హాజరు కాగా, మధ్యాహ్నం సెక్షన్ లో 1099 మంది హాజరయ్యారు. ములుగు మండలం బండారుపల్లి మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ దివాకర ఆకస్మికంగా తనిఖీ చేశారు. జనగామ జిల్లాలో 5470 మంది అభ్యర్థులకు 2893 మంది హాజరు కాగా, మధ్యాహ్నం పరీక్షకు 2891 మంది హాజరు కాగా, 2579 మంది గైర్హాజరయ్యారు.
జిల్లా కేంద్రంలోని సెయింట్ మెరీస్ ఎగ్జామ్సెంటర్ను కలెక్టర్రిజ్వాన్బాషా షేక్ఆకస్మికంగా సందర్శించి ఎగ్జామ్తీరును పరిశీలించారు. మహబూబాబాద్జిల్లాలో 7470 మందికి గానూ 3806 మంది అభ్యర్థులు హాజరు కాగా, మధ్యాహ్నం సెషన్లో 3803 మంది పరీక్షలు రాసినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఎస్పీ సుధీర్రామ్నాథ్కేకన్ఆధ్వర్యంలో బందోబస్త్ ఏర్పాటు చేశారు.