నిజామాబాద్, వెలుగు: రెండు రోజుల పాటు నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలు సోమవారం ముగిశాయి. మొత్తం 19,855 అభ్యర్థుల కోసం జిల్లావ్యాప్తంగా 63 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 8,915 మంది, మధ్యాహ్నం 8,911 మంది అభ్యర్థులు పరీక్ష హాజరయ్యారు. ఎగ్జామ్స్ కు అరగంట ముందు వచ్చినవారిని మాత్రమే అనుమతించారు. హాల్ టికెట్లు, ఐడీ ప్రూఫ్ చెక్‌చేశారు. షూస్ లేకుండా చెప్పులతో వచ్చిన వారిని తనిఖీల తరువాతే సెంటర్లోకి అనుమతించారు.
కామారెడ్డిలో 47.80 శాతం హాజరు
కామారెడ్డి, వెలుగు: గ్రూప్-2 పరీక్షలు కామారెడ్డి జిల్లాలో ముగిశాయి. సోమవారం నిర్వహించిన పరీక్షలకు మొత్తం 8,085 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఉదయం జరిగిన పరిక్షకు 3,859 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 3,871 మంది హాజరయ్యారు.
పరీక్ష సెంటర్లను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి పరిశీలించారు. ఎగ్జామ్‌కు ప్రత్యేక పరిశీలకులుగా డాక్టర్శరత్బాబు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిశీలకుడు రోహిత్‌కుమార్ సెంటర్లను విజిట్ చేశారు. రీజినల్ కో ఆర్డినేటర్ విజయ్‌కుమార్, అసోసియేట్రీజినల్ కో ఆర్డినేటర్ వి.శంకరయ్య పరీక్ష ఏర్పాట్లను సమన్వయం చేశారు.