ఖమ్మం జిల్లాలో ముగిసిన గ్రూప్​2 పరీక్షలు

ఖమ్మం జిల్లాలో ముగిసిన గ్రూప్​2 పరీక్షలు

ఖమ్మం టౌన్, వెలుగు:  జిల్లాలో గ్రూప్​2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం 28,101అభ్యర్థులకు 85 సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు. కలెక్టర్ ముజమ్మిల్​ఖాన్ పలు సెంటర్లను సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.


సగానికి పైగా ఎగ్జామ్​ రాయని అభ్యర్థులు 

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో గ్రూప్​2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం జరిగిన ఎగ్జామ్​కు 13,466 మంది అభ్యర్థులకు గానూ కేవలం 6,170 మంది మాత్రమే అటెండ్​అయ్యారు. 7,296 మంది ఆబ్సెంట్​అయ్యారు. మధ్యాహ్నం జరిగిన ఎగ్జామ్​కు 13,466 మందికి గానూ 6,173 మంది మాత్రమే అటెండ్​అయ్యారు. 7,293 మంది ఆబ్సెంట్​అయ్యారు. పలు ఎగ్జామ్​సెంటర్లను కలెక్టర్​జితేశ్, ఎస్పీ రోహిత్​రాజు పరిశీలించారు. ఎగ్జామ్​ సదర్భంగా సెంటర్ల వద్ద పోలీస్​బందోబస్తు ఏర్పాటు 
చేశారు. 

సెంటర్​లోకి అనుమతించలేదని అర్ధనగ్న నిరసన 

పాల్వంచ: పాల్వంచలో పరీక్షకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థిని సెంటర్​లోకి అనుమతించకపోవడంతో అభ్యర్థి అర్ధనగ్న ప్రదర్శన చేశాడు. పట్టణానికి చెందిన ఓ అభ్యర్థి ఎనిమిదిన్నరకే సెంటర్​దగ్గరకు వచ్చి లోపలికి వెళ్లకుండా సమయాన్ని వృథాచేశాడు. గేట్లు క్లోజ్​చేశాక సెంటర్​వద్దకు వచ్చి లోపలికి పంపించాలని పోలీసులతో గొడవకు దిగాడు. వారు అతడిని పంపంచకపోవడంతో చొక్కా, ప్యాంటు విప్పి నిరసన తెలిపాడు.