రేపు(ఆదివారం) ఏపీలో గ్రూప్2 ఎగ్జామ్స్ యథాతధం

రేపు(ఆదివారం) ఏపీలో గ్రూప్2 ఎగ్జామ్స్ యథాతధం

ఆంధ్రప్రదేశ్లో గ్రూప్2 మెయిన్స్ ఎగ్జామ్ ఆదివారం(ఫిబ్రవరి 23) యథాతధంగా నిర్వహించనున్నారు. ఎగ్జామ్ నిర్వహణపై ఏపీ  ప్రభుత్వం రాసిన లేఖపై ఏపీపీ ఎస్సీ స్పందించింది. పరీక్ష వాయిదా వేయలేదని స్పష్టం చేసింది. ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహణపై గందరగోళం తలెత్తిన క్రమంలో సీఎం చంద్రబాబు ఏపీపీఎస్సీకి లేఖ రాశారు. లేఖపై స్పందించిన ఏపీపీఎస్సీ.. ఎగ్జామ్ ను వాయిదావేయడం లేదని తేల్చి చెప్పింది. 

షెడ్యూల్ ప్రకారం ఆదివారం జరగాల్సిన గ్రూప్ 2 ఎగ్జామ్ జరగనుండగా.. కొంతమంది అభ్యర్థుల విజ్ణప్తి మేరకు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ సెక్రటరీకి లేఖ రాసింది.. రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణకు అభ్యర్థులనుంచి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. 

అయితే రాష్ట్రప్రభుత్వ విజ్ణప్తిని ఎపీపీఎస్సీ తిరస్కరించింది. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ ఆదివారం యథాతధంగా జరుగుతాయని ప్రకటించింది. రోస్టర్ అంశంపై ప్రస్తుతం కోర్టులో విచారణ సాగుతోంది. 

మరోవైపు గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహణపై తలెత్తిన గందరగోళంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఎగ్జామ్స్ నిర్వహణపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశాఖలో రోడ్లపై గ్రూప్ 2 అభ్యర్థులు భైఠాయించడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది.