- మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ జిల్లాలో గ్రూప్-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం తన కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏఎస్పీ మహేందర్, మెదక్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు, అబ్జర్వర్లకు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు గ్రూప్-–-2 రాత పరీక్ష బయోమెట్రిక్ పై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ నెల 15,16వ తేదీల్లో నిర్వహించబోయే గ్రూప్–-2 పరీక్ష బయోమెట్రిక్‌పై శిక్షణ నిర్వహించామన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గుర్తింపు కోసం బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు తీసుకుంటామన్నారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి ఒక గంట ముందుగానే (ఉదయం 9 గంటలకు) పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. మెదక్ జిల్లాలో మొత్తం 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 5,856 మంది అభ్యర్ధులు పరీక్షలు రాయనున్నారన్నారు. పోలీస్ బయోమెట్రిక్ ఆఫీసర్ (పీబీవో) మధుసూదన్ గౌడ్, చీప్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు తదితరులు పాల్గొన్నారు.