గ్రూప్ 2 పరీక్షలు తొలి రోజు ప్రశాంతం

గ్రూప్ 2 పరీక్షలు తొలి రోజు ప్రశాంతం
  • రెండు పేపర్ల కు హాజరయ్యింది 50 శాతం మందే
  • ఆలస్యంగా వచ్చి వెనుదిరిగిన 12 మంది అభ్యర్థులు

సిద్దిపేట రూరల్, వెలుగు: గ్రూప్ 2 పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా కేంద్రంలోని 37 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 13717 మంది అభ్యర్థులను కేటాయించగా, మొదటి పేపర్ కు 51.06 శాతంతో 7005 మంది, రెండో పేపర్ కు 50.70 శాతంతో 6955 మంది  హాజరయ్యారు.  పరీక్ష సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని మెరిడియన్ స్కూల్, ప్రభుత్వ జూనియర్ కాలేజ్, న్యూ హై స్కూల్, బీఎంఆర్ డిగ్రీ కాలేజ్ లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.

ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులు రాస్తున్న పరీక్షలను పరిశీలించి పరీక్ష సమయానికి ప్రారంభం కావడానికి ఏమైనా సమస్యలు తలెత్తాయా, ఎన్ని గంటలకు పరీక్ష పేపర్లు కేంద్రాలకు వచ్చాయి, ఎంతమంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.  అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. సీపీ అనురాధ పట్టణంలోని ఆయా సెంటర్ల వద్ద బందోబస్తు ఏర్పాట్లు ను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. 

తూప్రాన్​లో..

తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ కేంద్రంలోని రెండు కేంద్రాల్లో తొలిరోజు గ్రూపు -2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. అడిషనల్ ఎస్పీ మహేందర్ రెడ్డి ,ఆర్డీవో జయచంద్రా రెడ్డి, సీఐ రంగాకృష్ణ, తహసీల్దార్​విజయలక్ష్మి, ఎస్ఐ శివానందం ఆధ్వర్యంలో పరీక్ష సెంటర్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.