- ఏర్పాట్లు పూర్తి చేసిన టీజీపీఎస్సీ
- హాజరు కానున్న 5,51,847 మంది అభ్యర్థులు
- అరగంట ముందే గేట్ క్లోజ్చేస్తం
- అపోహలొద్దు, మెరిట్నే నమ్ముకోండి: కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం
హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 783 పోస్టుల భర్తీకి ఆది, సోమవారాల్లో టీజీపీఎస్సీ రాత పరీక్షలను నిర్వహించనుంది. గ్రూప్ 2 పరీక్షల వివరాలను కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం శనివారం మీడియాకు వెల్లడించారు. మొత్తం 5,51,847 మంది అప్లై చేసుకున్నారని, వారికోసం రాష్ట్రవ్యాప్తంగా 1,368 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 33 జిల్లాల్లో 58 రీజనల్కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
పరీక్ష నిర్వహణకు 49,843 మంది సిబ్బందిని నియమించినట్టు చెప్పారు. వారితోపాటు కలెక్టరేట్ల నుంచి నోడల్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది కలిపి 1,719 మంది, పోలీస్ శాఖ తరఫున 6,865 మంది విధుల్లో ఉంటారన్నారు. ప్రత్యక్షంగా 58,427 మంది, పరోక్షంగా మరో 15 వేల మంది.. ఇలా 70 వేల మందికి పైగా సిబ్బంది గ్రూప్ 2 నిర్వహణలో భాగస్వాములు అవుతున్నారని వెల్లడించారు.
ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి
గ్రూప్ 2 పరీక్షను రెండు రోజుల పాటు ఉదయం, సాయంత్రం నాలుగు పేపర్లుగా నిర్వహించనున్నామని, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఎగ్జామ్ జరుగనుందని బుర్రా వెంకటేశం తెలిపారు. పరీక్ష నిర్ణీత సమయానికి అర గంట ముందే గేటుకు తాళాలు వేస్తామన్నారు. శనివారం వరకు 75 శాతం మంది హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారన్నారు.
Also Read : ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్రూప్ 2 కు పకడ్బందీ ఏర్పాట్లు
టీజీపీఎస్సీపై ఎలాంటి అపోహలు వద్దని, మెరిట్ ఉన్నోళ్లకే ఉద్యోగం వస్తుందన్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉంటాయని, 58 స్టోరేజీ పాయింట్లలో ఓఎంఆర్ షీట్లు, ప్రశ్నాపత్రాలను రెడీ చేశామని చెప్పారు. బయోమెట్రిక్ తప్పని సరి అని వెల్లడించారు. టీజీపీఎస్సీ కేవలం సిలబస్ మాత్రమే చెబుతుందని, ఏ పుస్తకాలు చదవాలన్నది తాము చెప్పబోమని తెలిపారు.
మార్చి నెలాఖరులో గ్రూప్ 2 పరీక్ష ఫలితాలు
జాబ్ క్యాలెండర్ ప్రకారం కొత్త నోటిఫికేషన్లపై జనవరి నాటికి స్పష్టత ఇస్తామని బుర్రా వెంకటేశం చెప్పారు. పలు పరీక్షల తేదీలు క్లాష్ అవుతున్నట్టు తమ దృష్టిలో ఉందని, కానీ కొద్ది మంది మాత్రమే రెండు పరీక్షలు రాస్తున్నారని చెప్పారు. ఆ కొద్ది మంది కోసం ఐదు లక్షల మంది అభ్యర్థుల జీవితాలను ఇరకాటంలో పెట్టలేమన్నారు.
కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఒక పూట 28 వేల మంది రాసేందుకు మాత్రమే అవకాశం ఉందని ఉందని, అలా పెడితే గ్రూప్ 2 పరీక్షల పూర్తికి 25 రోజులకుపైగా పడుతుందన్నారు. అందుకే ఓఎంఆర్ షీట్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మార్చి నెలాఖరులో గ్రూప్ 2 పరీక్ష ఫలితాలు రిలీజ్ చేస్తామని వివరించారు. టీజీపీఎస్సీలో కొత్తగా 80 మందిని డిప్యూటేషన్ విధానంలో తీసుకున్నట్టు చెప్పారు.
18,19 తేదీల్లో ఢిల్లీకి..
పోటీ పరీక్షల నిర్వహణపై అధ్యయనం చేసేందుకు టీజీపీఎస్సీ బృందం ఈ నెల 18, 19 తేదీల్లో ఢిల్లీకి వెళ్లనున్నదని బుర్రా వెంకటేశం చెప్పారు. 18న యూపీఎస్సీ కమిషన్ సభ్యులతోపాటు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సీఐసీ)ని సందర్శించనున్నట్లు చెప్పారు. 19న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాతీయ టెస్టింగ్ ఏజెన్సీని సందర్శించనున్నట్లు తెలిపారు.
అక్కడి పరిస్థితులపై నివేదికను జనవరి నాటికి ప్రభుత్వానికి అందిస్తామని, తర్వాత రిక్రూట్‌మెంట్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతామని వెల్లడించారు. కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు జనవరిలో తెలంగాణలో పర్యటిస్తారని తెలిపారు.