
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో.. వివిధ ఉద్యోగ నియామక పరీక్షలు ప్రభావితమవుతున్నాయి. ముఖ్యంగా నవంబరు 2, 3 తేదీల్లో జరగాల్సిన గ్రూపు-2 పరీక్ష (TSPSC Group 2 Exam).. వాయిదా పడింది. వచ్చే ఏడాది జనవరి జనవరి 6..7 వ తేదీల్లో నిర్వహించాలని TSPSC నిర్ణయం తీసుకుంది.తెలంగాణలో నవంబరు 3 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా.. తెలంగాణ గ్రూపు-2 పరీక్షకు పెద్దఎత్తున పోలీసు, ఇతర శాఖల సిబ్బందిని కేటాయించడం సాధ్యం కాదని గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేశారు.
మొత్తం 783 గ్రూపు-2 పోస్టులకు గాను దాదాపు 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-2 పరీక్ష (TSPSC Group 2 Exam) నిర్వహణకు 1600 కేంద్రాల్లో పోలీసులు దాదాపు 25 వేల మంది, పరీక్ష సిబ్బంది 20 వేల మంది అవసరం ఉంటుంది. ఎన్నికల నేపథ్యంలో పరీక్షకు సిబ్బంది సర్దుబాటు కష్టమని కలెక్టర్లు సూచించారు. రిటర్నింగ్, పరీక్ష చీఫ్ సూపరింటెండెంట్ అధికారుల నియామకం సాధ్యంకాదని తెలిపారు. రెండురోజుల పాటు వరుసగా నాలుగు సెషన్లలో పరీక్షల నిర్వహణకు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతాయని వివరించినట్లు తెలిసింది.