విద్యార్థిని ప్రవల్లిక ఆత్మహత్య కేసులో మరో ట్వి్స్ట్. ప్రవల్లిక మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని ఆమె కుటుంబ సభ్యులు మీడియాకు తమ వెర్షన్ ను విడుదల చేశారు. మొన్నటి వరకు ప్రవల్లిక మృతికి ఉద్యోగం రాకపోవడమే కారణమన్న తల్లి విజయ..అక్టోబర్ 17వ తేదీన మాట మారుస్తూ..ఓ వీడియో విడుదల చేశారు. ప్రవల్లిక చనిపోవడానికి కారణం శివరామే కారణమని ఆరోపించారు. అతన్ని కఠినంగా శిక్షించాలని కోరారు.
ప్రవల్లిక తల్లి ఏమన్నందటే..
కూలినాలి చేసుకుంటూ నా బిడ్డను పట్నంలో చదివించుకుంటున్నానని ప్రవల్లిక తల్లి విజయ తెలిపారు. తన కొడుకు ప్రణయ్ కూడా హైదరాబాద్ లోనే చదువుతున్నాడని చెప్పారు. అయితే ప్రవల్లికను శివరాం వెంటపడి వేధించడం వల్లే చనిపోయిందని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు గొడవలు ఉంటే వారు వారు చూసుకోవాలని..ఈ రాజకీయాల్లోకి తనను, తన బిడ్డ చావును లాగొద్దని ఆమె విజ్ణప్తి చేశారు. పార్టీలకు అనుకూలంగా మాట్లాడాలని వెంటపడొద్దని కోరారు.
Also Read :- కేసీఆర్ సర్కార్ది నిరంకుశ పాలన
అన్న ప్రణయ్ ఏమన్నాడంటే..
తన చెల్లి మరణానికి శివరాం వేధింపులే కారణమన్నాడు ప్రవల్లిక అన్న ప్రణయ్. అతని వల్లే ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. ప్రవల్లిక మృతికి కారణమైన శివరాంను కఠినంగా శిక్షించాలని కోరాడు.