గ్రూప్ 2 ఫలితాలు రిలీజ్.. టాప్ 10 ర్యాంకర్లు వీరే

గ్రూప్ 2 ఫలితాలు రిలీజ్.. టాప్ 10  ర్యాంకర్లు వీరే
  • విడుదల చేసిన టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం 
  •     వెబ్​సైట్​లో జనరల్​ ర్యాంకింగ్​ లిస్ట్​
  •     ఫైనల్​​ కీ, ఓఎంఆర్​ షీట్, మాస్టర్ క్వశ్చన్​ పేపర్​​ కూడా..
  •     2,36,649 మందికి జనరల్ ర్యాంకులు 
  •     13,315 మంది పేపర్లు ఇన్​వ్యాలిడ్​
  •     స్టేట్ టాపర్​గా వెంకట హర్షవర్ధన్​

హైదరాబాద్, వెలుగు: గ్రూప్–2 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఫైనల్ కీతో పాటు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్​(జీఆర్ఎల్​)ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) అధికారికంగా విడుదల చేసింది. ఓఎంఆర్ షీట్, మాస్టర్​క్వశ్చన్​పేపర్‎​ను అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లలో అందుబాటులో ఉంచింది. మంగళవారం హైదరాబాద్‎లోని టీజీపీఎస్సీ కార్యాలయంలో గ్రూప్ 2 రిజల్ట్‎ను కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల  చేశారు.  

రాష్ట్రవ్యాప్తంగా 783 గ్రూప్– 2 పోస్టుల భర్తీకి నిరుడు డిసెంబర్ 15,16 తేదీల్లో ఎగ్జామ్ జరిగింది. దీనికి 5,51,855 మంది అప్లై చేసుకోగా.. వారిలో 2,49,964 మంది అభ్యర్థులు 4 పరీక్షలకు అటెండ్ అయ్యారు. వీరిలో 2,36,649 మందికి జనరల్ ర్యాకింగ్ లిస్ట్‎ను కమిషన్ ప్రకటించింది. మరో 13,315 మంది క్యాండిడేట్ల పేపర్లు ఇన్​వ్యాలిడ్​అయ్యాయని వెల్లడించింది. కాగా, ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీ, మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వశ్చన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేపర్లు మార్చి 11 నుంచి ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 9వ తేదీ వరకు టీజీపీఎస్సీ వెబ్​సైట్‏లో అందుబాటులో ఉంటాయి.

అభ్యర్థులు తమ ఓఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షీట్లను వ్యక్తిగత లాగిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీజీపీఎస్సీ ఐడీ, హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి రిజిస్టర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఓటీపీ ఆధారంగా డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవచ్చు. జీఆర్ఎల్ ప్రకటించిన అభ్యర్థులకు టీజీపీఎస్సీ త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టనున్నది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఇచ్చిన పోస్టుల ఆప్షన్లకు తగ్గట్టుగా 1:2 రేషియోలో లిస్ట్​ను ప్రకటించనున్నది. ఈ కార్యక్రమంలో టీజీపీఎస్సీ సభ్యులు అమీర్ ఉల్లాఖాన్, నారి యాదయ్య, రామ్ మోహన్ రావు, పాల్వాయి రజనీకుమారి తదితరులు పాల్గొన్నారు. 

టాప్​ మార్కులు 447.088 

సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన నారు వెంకట హర్షవర్ధన్ గ్రూప్– 2 టాపర్​గా నిలిచారు. 600 మార్కులకు గానూ 447.088 మార్కులతో సత్తా చాటారు. 444.754 మార్కులతో వడ్లకొండ సచిన్ సెకండ్, 439.344 మార్కులతో మనోహర్​రావు థర్డ్​ర్యాంక్ కైవసం చేసుకున్నారు. ఉమెన్స్ కేటగిరీలో లక్కిరెడ్డి వినీషా రెడ్డి టాపర్​ గా నిలిచారు. జనరల్ కేటగిరీలో 408.713 మార్కులతో 32వ ర్యాంకులో నిలిచారు. 

ఆ తర్వాతి స్థానాల్లో బాయికాడి సుష్మిత (41వ ర్యాంకు), కొప్పు శ్రీవేణి (69) ఉన్నారు.  అయితే, జనరల్ కేటగిరీలో టాప్–​ 10 లో మహిళా అభ్యర్థులు ఎవరూ లేవు.  టాప్– 100లో కేవలం నలుగురే మహిళలు ఉండగా, టాప్ 500లో 48 మంది ఉన్నారు. కాగా, మంచి ర్యాంకులు పొందిన చాలామంది అభ్యర్థులు ప్రస్తుతం వివిధ డిపార్ట్​మెంట్స్​లో ఉద్యోగాలు చేస్తున్న వారే కావడం గమనార్హం.

టాప్ 10  ర్యాంకర్లు వీరే.. 

1    నారు వెంకట హర్షవర్ధన్    447.088 
2    వడ్లకొండ సచిన్    444.754 
3     బి.మనోహర్ రావు     439.344 
4    శ్రీరామ్ మధు     438.972 
5     చింతల్ పల్లి ప్రీతమ్ రెడ్డి      431.102 
6    అఖిల్ ఎర్ర      430.807 
7    గొడ్డేటి అశోక్    425.842 
8     చిమ్ముల రాజశేఖర్     423.933 
9     మేకల ఉపేందర్    423.119 
10    కరింగు నరేశ్    422.989