గ్రూప్​–3కి హైదరాబాద్​లో102 సెంటర్లు

గ్రూప్​–3కి హైదరాబాద్​లో102 సెంటర్లు
  • పరీక్ష రాయనున్న 45, 918 మంది అభ్యర్థులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రూప్ -3 ఎగ్జామ్స్ కు ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ ముకుంద రెడ్డి అధికారులను ఆదేశించారు.  పరీక్షల నిర్వహణపై మంగళవారం రీజనల్ కోఆర్డినేటర్లు, నోడల్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, జాయింట్ రూట్ ఆఫీసర్స్ తో మీటింగ్ నిర్వహించారు.

ఈ నెల 17, 18 తేదీల్లో పరీక్షలు జరగనుండగా, హైదరాబాద్ జిల్లాలో 45,918 మంది అభ్యర్థులు102 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. ఇందులో పీడబ్ల్యూడీ అభ్యర్థుల కోసం 27 కేంద్రాలను కేటాయించినట్లు చెప్పారు. అభ్యర్థులు టీజీపీఎస్సీ సూచనలు పాటించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ వెంకటాచారి, డీసీపీ భాస్కర్, ఏసీపీ కిషన్ పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లాలో మొత్తం 56,394 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్ తెలిపారు. రంగారెడ్డి కలెక్టరేట్​లో సంబంధిత అధికారులతో మంగళవారం ఆమె పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. అభ్యర్థులను ఉదయం 8.30 గంటల నుంచి 9:30 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లో అనుమతిస్తారని, ఆ తర్వాత గేట్లు మూసి వేస్తామన్నారు. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్షకు అనుమతించరన్నారు.