నవంబర్ 17,18 గ్రూప్–3 పరీక్షలు .. హాజరుకానున్న 5.36 లక్షల మంది

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 1,363 పోస్టుల భర్తీ కోసం నిర్వహించే గ్రూప్3 పరీక్ష ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్ 1,  మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్2 పరీక్ష జరగనున్నది. 

సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం12.30 వరకు పేపర్3 పరీక్ష ఉంటుంది. పరీక్షా కేంద్రంలోకి నిర్ణీత టైమ్ కంటే గంటన్నర ముందే అంటే మార్నింగ్ సెషన్​లో ఉదయం 8.30 నుంచి, మధ్యాహ్నం సెషన్​కు1.30 నుంచి అనుమతిస్తారు. ఈ పరీక్షలకు మొత్తం 5,36,395 మంది అభ్యర్థులు అటెండ్ కానున్నారు.