- గ్రూప్–3కి 50.24 శాతం హాజరు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్రూప్ 3 పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. మూడు పేపర్లకు కలిపి 50.24 శాతం మంది మాత్రమే హాజరయ్యారు. మొత్తం 1,363 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆదివారం నుంచి రాత పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్ష కోసం 5,36,400 మంది అప్లై చేసుకున్నారు. ఆదివారం జరిగిన పేపర్ 1కు 51.1 శాతం మంది, పేపర్ 2కు 50.7 శాతం మంది హాజరయ్యారు. సోమవారం ఉదయం జరిగిన పేపర్ 3 పరీక్షకు 2,69,483 మంది మాత్రమే అటెండ్ అయ్యారు.