గ్రూప్ 3 ​ ఎగ్జామ్స్​.. అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్​ ఇవే.. తప్పు చేశారో డిబార్​ ..

గ్రూప్ 3 ​ ఎగ్జామ్స్​.. అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్​ ఇవే.. తప్పు చేశారో డిబార్​ ..

గ్రూప్​ –3 ఎగ్జామ్స్​ కు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది.  ప్రభుత్వ శాఖల్లోని పలు ఉద్యోగాల భర్తీకి నిర్వహించే గ్రూప్‌-3 పరీక్షలు ఆది, సోమవారాల్లో  (నవంబర్​ 17,18)  జరగనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 5.36 లక్షమంది అభ్యర్థుల కోసం మొత్తం 1,401 కేంద్రాలను ఏర్పాటు చేశారు.  ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతను జిల్లా కలెక్టర్లు.. ఎస్పీలకు ప్రభుత్వం అప్పగించింది.  గ్రూప్​ 3 ఎగ్జామ్స్​ మొత్తం మూడు పేపర్లు.. మూడు  సెషన్స్​లో జరుగుతాయి.  

ALSO READ : నవంబర్​ 17 నుంచి గ్రూప్ 3 ఎగ్జామ్స్​

ఆదివారం ( నవంబర్​ 17)  ఉదయం జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీస్‌, మధ్యాహ్నం హిస్టరీ, పాలిటీ అండ్‌ సొసైటీ, సోమవారం ( నవంబర్​ 18)  ఉదయం ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌ పరీక్షను నిర్వహిస్తారు. గ్రూప్‌ 3 పరీక్షలు ఆఫ్‌లైన్‌ విధానంలో ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం 450 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. రాత పరీక్ష ఆధారంగానే ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూ ఉండదు. రాత పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ.. మూడు భాషల్లో నిర్వహిస్తారు.

అభ్యర్ధులకు ముఖ్య సూచనలు

  •  నవంబర్‌ 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌ 1 పరీక్ష ..మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌ 2 పరీక్ష జరుగుతుంది.
  • ఉదయం సెషన్‌లో 9.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్‌లో 2.30 గంటలకు గేట్లు మూసివేస్తారు. ఆ తర్వాత ఎట్టిపరిస్థితుల్లో అనుమతించరు.
  • హాల్​ టికెట్లు TGPSC వెబ్​సైట్​ నుంచి డౌన్​ లోడ్​ చేసుకోవాలి.  హాల్​ టికెట్​పై ఫొటో లేకపోతే.. దానిపై ఫొటో అంటించి గెజిటెడ్​ ఆఫీసర్​ సంతకం ధృవీకరించవలసి ఉంటుంది.  ఇంకా పరీక్షా కేంద్రంలో డిక్లరేషన్​ ఇవ్వాల్సి ఉంటుంది.  మూడు పాస్​ పోర్ట్​ ఫోటోలను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి. 
  • హాల్​టికెట్లనే A4 పేపర్​ పై డౌన్​ లోడ్​ చేసుకోవాలి. 
  • బ్లూ లేదా బ్లాక్​ పెన్​ తో పాటు.. హాల్​ టికెట్​,, ఒరిజినల్​ గుర్తింపు కార్డు ( పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటరుకార్డు, ఆధార్‌కార్డు, ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపుకార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు ) తీసుకువెళ్లాలి.
  • మొదటి పరీక్షకు తీసుకెళ్లిన హాల్‌టికెట్‌నే చివరి పరీక్ష వరకూ తీసుకెళ్లాలి. పరీక్షల ఆనంతరం హాల్‌టికెట్‌ కాపీని, ప్రశ్నాపత్రాలను భద్రంగా పెట్టుకోవాలి.. ఉద్యోగంలో చేరే సమయంలో ఈ హాల్​టికెట్​ అవసరపడే అవకాశం ఉంది. 
  • ఎగ్జామ్​ పేపర్లో అన్ని ప్రశ్నలు ప్రింట్​ అయ్యాయో లేదో చూసుకోవాలి.. ఆ తరువాతే పరీక్ష రాయడం మొదలు పెట్టాలి. 
  • తప్పుడు పత్రాలతో హాజరైనా.. ఒకరి బదులు మరొకరు హాజరైనా డిబార్​తోపాటు క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని TGPSC తెలిపింది.