నవంబర్​ 17 నుంచి గ్రూప్ 3 ఎగ్జామ్స్​

నవంబర్​ 17 నుంచి గ్రూప్ 3 ఎగ్జామ్స్​
  • రెండ్రోజులపాటు మూడు పేపర్లు 
  • అటెండ్ కానున్న 5,36,395 మంది 
  • రాష్ట్రంలో 1,401 పరీక్షా కేంద్రాలు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రేపటి నుంచి గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల పాటు మూడు పేపర్లకు ఎగ్జామ్ నిర్వహించనున్నారు. 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరుగుతుంది. ఈ నెల 18న పేపర్3 పరీక్ష ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు నిర్వహిస్తారు.

పరీక్షా కేంద్రాల్లోకి నిర్ణీత సమాయానికంటే గంటన్నర ముందు నుంచే అభ్యర్థులకు అనుమతిస్తామని టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. అర గంట ముందే పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేయనున్నట్టు స్పష్టం చేశారు. ముందే ఎగ్జామ్​సెంటర్లను చూసుకోవాలని సూచించారు.

మొత్తం 1,363 పోస్టుల భర్తీ కోసం 5,36,395 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారికోసం 1,401 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.  అభ్యర్థులు బ్లాక్/ బ్లూ పెన్స్, హాల్ టికెట్ తో పాటు ఏదైనా ఒక ఫొటో ఐడీ కార్డును మాత్రమే సెంటర్లకు తీసుకురావాలని చెప్పారు.