మెదక్​జిల్లాలో ప్రశాంతంగా గ్రూప్ 3 పరీక్షలు

మెదక్​జిల్లాలో ప్రశాంతంగా గ్రూప్ 3 పరీక్షలు
  • పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్లు

సిద్దిపేట, వెలుగు: జిల్లాలో ఆదివారం మొదటి రోజు టీజీపీఎస్ గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో మొత్తం 13,401 మంది అభ్యర్థుల కోసం 37 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 55 శాతం హాజరు మాత్రమే నమోదైంది.  ఉదయం 10 నుంచి 12.30 వరకు జరిగిన మొదటి పేపరుకు 7420 (55.35శాతం), మధ్యాహ్నం 3 నుంచి 5.30 వరకు జరిగిన రెండో పేపర్ కు7412 (55.27 శాతం) మంది హాజరయ్యారు.

మొదటి పేపరుకు హాజరైన వారిలో 8 మంది రెండో పేపర్ కు హాజరు కాలేదు. సోమవారం పేపర్ 3 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30  జరగనుంది. కలెక్టర్ మనుచౌదరి, సీపీ అనురాధ, అడిషనల్ సీపీ మల్లారెడ్డి పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి పరిశీలించారు.  

మెదక్​జిల్లాలో..

మెదక్​టౌన్: జిల్లాలో గ్రూప్​3 పరీక్షలు సజావుగా జరిగాయి. పరీక్ష నిర్వహణకు 19 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి రోజు 5,867 అభ్యర్థులకు 3,187 హాజరు కాగా 2,680 పరీక్షకు గైర్హాజరయ్యారు. 54 శాతమే హాజరు నమోదైంది. కలెక్టర్​రాహుల్​రాజ్​పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్​ కాలేజీలో జరుగుతున్న పరీక్షలను పరిశీలించారు. ఆయన వెంట జిల్లా ఇంటర్మీడియట్​అధికారి మాధవి, జిల్లా హార్టికల్చర్​ఆఫీసర్​ప్రతాప్​సింగ్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.

సంగారెడ్డిలో..

సంగారెడ్డి టౌన్:  జిల్లాలో నిర్వహించిన గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 49 పరీక్షా  కేంద్రాలను ఏర్పాటు చేశారు. 15,123 మంది పరీక్ష రాయాల్సి ఉండగా కేవలం 8045  మంది మాత్రమే హాజరయ్యారు. 7,078 మంది పరీక్షకు గైరాజరయ్యారు. తార ప్రభుత్వ డిగ్రీ కాలేజ్​లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని అధికారులు తనిఖీ చేశారు.