గ్రూప్ 3 ప్రిలిమినరీ కీ రిలీజ్

గ్రూప్ 3 ప్రిలిమినరీ కీ రిలీజ్
  • టీజీపీఎస్సీ వెబ్ సైట్​లో అందుబాటులో కీ
  • ఈ నెల 12 వరకు అభ్యంతరాల స్వీకరణ

హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 3 పరీక్షల ప్రిలిమినరీ కీని టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్​https://www.tspsc.gov.in ​లో కీని అందుబాటులో ఉంచింది. ఈ నెల 12 సాయంత్రం 5గంటల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1,363 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో 1,401 పరీక్ష కేంద్రాల్లో రాత పరీక్షలు నిర్వహించారు. 5,36,400 మందికి గాను 2,69,483 మంది అటెండ్ అయ్యారు. టీజీపీఎస్సీ ఐడీ, హాల్ టికెట్ నంబర్ ద్వారా కీని చెక్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ వెల్లడించారు. అభ్యంతరాలకు సంబంధించిన ఆధారాలనూ ఆన్​లైన్​ లో సబ్మిట్ చేయాలని సూచించారు. 

టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవ‌‌‌‌ర్సీస్ ఫ‌‌‌‌లితాలు విడుద‌‌‌‌ల‌‌‌‌

టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవ‌‌‌‌ర్సీస్(టీపీబీవో) ఫ‌‌‌‌లితాల‌‌‌‌ను టీజీపీఎస్సీ విడుద‌‌‌‌ల చేసింది. టీపీబీవో ఉద్యోగాల‌‌‌‌కు ఏడు జోన్ల పరిధిలో ఎంపికైన 171 మంది అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో అందుబాటులో ఉంచింది. టీపీబీవో ఉద్యోగాల‌‌‌‌కు 2023 జులైలో టీజీపీఎస్సీ రాత‌‌‌‌ప‌‌‌‌రీక్షలు నిర్వహించింది. ఇతర వివరాలకు https://www.tspsc.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని అధికారులు కోరారు.

నేడు సీడీపీవో ప్రిలిమినరీ కీ రిలీజ్ 

ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖలో సీడీపీవో పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీని టీజీపీఎస్సీ అధికారులు రిలీజ్ చేశారు. గురువారం ఈ ప్రిలిమినరీ కీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. 11వ తేదీన సాయంత్రం 5 గంటల లోపు వచ్చిన అభ్యంతరాలనే స్వీకరిస్తామని, ఆలస్యంగా వచ్చిన వాటిని పరిగణనలోకి తీసుకోబోమని అధికారులు స్పష్టం చేశారు.