హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 4 పోస్టులను బ్యాక్ లాగ్ కాకుండా వెంటనే భర్తీ చేయాలని అభ్యర్థులు పలువురు శుక్రవారం గాంధీ భవన్ లో ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకొని తమ నిరసనను తెలియజేశారు. గ్రూప్4 పోస్టులను బ్యాక్ లాగ్ కాకుండా వెంటనే ప్రభుత్వం తగిన రీతిలో స్పందించి భర్తీ చేస్తే కనీసం రెండు నుంచి మూడు వేల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.