హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ శాఖకు ఎంపికైన గ్రూప్–4 ఉద్యోగుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ శుక్రవారం పూర్తయింది. సర్టిఫికెట్ల పరిశీలన గురు, శుక్రవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని సీడీఎమ్ఏ కార్యాలయంలో, హన్మకొండలోని కూడా కార్యాలయంలో జరిగింది.
మున్సిపల్ శాఖకు మొత్తంగా 2,217 మంది జూనియర్ అసిస్టెంట్లు, అకౌంటెంట్లు, వార్డ్ ఆఫీసర్స్ ఎంపికవ్వగా1,928 మంది అటెండ్ అయ్యారని ఆ శాఖ అధికారులు పత్రిక ప్రకటనలో తెలిపారు. మిగతా 289 మందికి మూడు రోజులే గడువిచ్చామని అటెండ్ కావాలని అధికారులు కోరారు.