
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రూప్–4 రిక్రూట్‌మెంట్‌లో ఉద్యోగాలు సాధించిన వారిలో జీహెచ్ఎంసీకి కేటాయించిన 174 మంది జూనియర్ అసిస్టెంట్లు సోమవారం రిపోర్ట్ చేశారు. వారికి జీహెచ్ఎంసీ హెడ్డాఫీస్, జోనల్, సర్కిల్ ఆఫీసులు కేటాయిస్తూ మేయర్గద్వాల్విజయలక్ష్మి పోస్టింగ్ ఆర్డర్లు అందజేశారు. అంకితభావంతో పనిచేసి జీహెచ్ఎంసీకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అడ్మిన్ అడిషనల్ కమిషనర్ వేణుగోపాల్, జాయింట్ కమిషనర్ శ్రీనివాస్, ఏఎంసీ జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.