
పుణె ఖడక్‌వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా గ్రూప్ ‘సి’ (బ్యాక్‌లాగ్ సహా) ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత: పోస్టును అనుసరించి టెన్త్, 12వ తరగతి, ఐటీఐ, సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఎల్‌డీసీ/ స్టెనోగ్రాఫర్/ డ్రాఫ్ట్స్‌మ్యాన్/ డ్రైవర్/ ఫైర్‌మెన్ పోస్టులకు 18- నుంచి 27 ఏళ్లు. ఇతర పోస్టులకు 18- నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్: పోస్టును అనుసరించి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: ‘ఎంప్లాయ్‌మెంట్ న్యూస్’లో ఉద్యోగ ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం www.ndacivrect.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.