గ్రూప్ 1 హాల్ టికెట్లు విడుదల .. ఎప్పుడంటే..

గ్రూప్ 1 హాల్ టికెట్లు విడుదల .. ఎప్పుడంటే..

హైదరాబాద్, వెలుగు: గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఈ నెల 14 నుంచి టీజీపీఎస్సీ వెబ్ సైట్​లో అందుబాటులోకి రానున్నాయి. https://www.tspsc.gov.inలో హాల్ టికెట్లు పెడుతున్నట్టు కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు జరుగనున్నాయి. ప్రతిరోజు మధ్యాహ్నం 2  గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష హాల్‌లోకి మధ్యాహ్నం 12.30 గంటల నుంచే అభ్యర్థులను అనుమతించనున్నట్టు తెలిపారు. అభ్యర్థులకు టెక్నికల్ ఇబ్బందులు ఎదురైతే 040 -23542185 లేదా  040 -23542187కు కాల్ చేయాలని సూచించారు.