వీధి కుక్కల నుంచి రక్షించాలని.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన చిన్నారులు

వీధి కుక్కల నుంచి రక్షించాలని..  పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన చిన్నారులు

జీడిమెట్ల, వెలుగు: వీధికుక్కల నుంచి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని పలువురు చిన్నారులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్సీఎల్​నార్త్ ​కాలనీకి చెందిన చిన్నారులు ఆదివారం పేట్ బషీరాబాద్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కాలనీలో వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉందని, రెండున్నర ఏండ్లలో 75 మందిపై దాడి చేశాయన్నారు. 

తాజాగా రెండు రోజుల్లో నలుగురిపై దాడి చేశాయని పేర్కొన్నారు. దీనిపై మున్సిపాలిటీలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని, మీరైనా తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఆడుకోవాలంటే , స్కూల్స్​కు వెళ్లాలంటే ‘భయంగా ఉంది.. సేవ్​ అజ్’​ అంటూ ప్లకార్డులతో  పోలీస్​స్టేషన్​ వద్ద నిరసన చేశారు. మున్సిపల్​అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు హమీ ఇవ్వడంతో వారి తల్లిదండ్రులతో చిన్నారులు వెనుదిరిగారు.