ఇండియాలో ఉండలేను. నేను భారత్ లో ఉండలేను. ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్లిపోతున్నా. 2025 నుంచి సింగపూర్ లో స్థిరపడుతాను. ఇందుకు సంబంధించి డాక్యుమెంటేషన్ జరుగుతోంది. ఇక్కడి రాజకీయ నాయకులతో నేను పోరాడలేను. ప్రజలు ఇక్కడ కాలుష్య వాతావరణంలో జీవిస్తున్నా వాళ్లెందుకు బాధ్యత తీసుకోవడంలేదు. ఇక్కడి సర్కారుకు నేను 40 శాతం పన్ను కట్టలేను. ఒకవేళ మీ దగ్గర కూడా డబ్బులు ఉంటే దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలని సలహా ఇస్తున్నా.
ట్విట్టర్ లో సిద్దార్థ్ సింగ్ గౌతమ్
హైదరాబాద్: ‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. నాగులో నాగన్న.. ధరలిట్లా పెరుగవట్టే నాగులో నాగన్న..’ఈ సినిమా పాట అందరికీ గుర్తుండే ఉంటుంది.. సరిగ్గా ఇప్పుడు ఇదే సిచ్యువేషన్. కేంద్రం విధిస్తున్న పన్నుల మోతతో పబ్లిక్ అప్పుల పాలైతుండ్రు. నిన్న బీహార్ రాజధాని పాట్నాలో జీఎస్టీపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో చేసిన ప్రతిపాదనలు అమల్లోకి వస్తే వేతన జీవి పారిపోవాల్సిన పరిస్థితులను ప్రతిబింబింప జేస్తున్నాయి. కాదు కాదు.. కొందరు దేశం విడిచి వెళ్లిపోతున్నట్టు ఏకంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించడం సంచలనంగా మారింది. అందులోనూ ధూమపాన ప్రియులైతే వామ్మో అంటూ గుడ్లు తేలేస్తున్నారు.
తాజా ప్రతిపాదనల ప్రకారం సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, కొన్ని రకాల డ్రింక్స్పై ఏకంగా 35% జీఎస్టీ విధించనున్నారు. అలాగే మీరు కొన్న బట్టల ఖరీదు రూ. 1,500 దాటిందా.. మీరు అడ్డంగా బుక్కయినట్టే.. ఇప్పటి వరకు 5% ఉన్న జీఎస్టీ కాస్తా 18% శాతానికి ఎగబాకుతుంది.. అదే బట్టలు కాస్తా రూ. 10 వేలు దాటాయనుకోండి.. 28% జీఎస్టీ కట్టాల్సిందే.. అంటే 10 వేల ఒక్క రూపాయి బట్టలు కొంటే.. 12,801 మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన మీరు తీసుకొనే బట్టలు ఖరీదు రూ. 1,500 లోపే ఉండాలి. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 148 రకాల వస్తువులపై జీఎస్టీ మార్చాలని ప్రతిపాదించింది.
Also Read:-మీషోలో తెగ ఆర్డర్లు పెడుతుంటారా.. ఈ ముగ్గురూ ఏం చేశారో చూడండి..!
ఎక్సర్సైజ్ బుక్స్పై ప్రస్తుతం ఉన్న 12% జీఎస్టీని 5%కు తగ్గించాలని ప్రతిపాదించింది. అలాగే ప్రస్తుతం విద్యార్థులకు సంబంధించి నోట్ బుక్స్పై ఉన్న 12% ట్యాక్స్ విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. ఈ నెల 21న జైసల్మేర్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు తుదిరూపు రానుంది. అదే జరిగితే పేదలే కాదు. మధ్య తరగతి ప్రజలు, ఉద్యోగులు బతకడం చాలా కష్టంగా మారుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. కొందరైతే దేశం విడిచి వెళ్లిపోతామంటూ ట్విట్టర్ లో ఏకంగా కామెంట్లు పెడుతుండటం గమనార్హం.