టీ20 వరల్డ్ కప్ లో లీగ్ మ్యాచ్ లు మంగళవారం (జూన్ 18) ముగియనున్నాయి. రెండు లీగ్ మ్యాచ్ లు మినహా గ్రూప్ మ్యాచ్ లు పూర్తయ్యాయి. న్యూజిలాండ్, పపువా న్యూ గినియా మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మంగళవారం (జూన్ 18) చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సూపర్ 8 వెళ్లే జట్లేవో ఖరారు ఖావడంతో ఈ రెండు మ్యాచ్ లు నామమాత్రం కానున్నాయి.
సోమవారం (జూన్ 17) ఉదయం నేపాల్ పై బంగ్లాదేశ్ గెలవడంతో సూపర్ 8కు వెళ్లే జట్లేవో తేలిపోయింది. గ్రూప్1లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా ఉంటే .. గ్రూప్ 2 లో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, యుఎస్‌ఎలు ఉన్నాయి. భారత కాలమాన ప్రకారం మ్యాచ్ లు బుధవారం (జూన్ 19) నుంచి ప్రారంభమవుతాయి. ఆంటిగ్వా, బార్బడోస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ వేదికలుగా ఖరారు చేయబడ్డాయి.
సూపర్ 8 షెడ్యూల్:
గ్రూప్ 1:
జూన్ 20: ఆఫ్ఘనిస్తాన్ v ఇండియా, బ్రిడ్జ్‌టౌన్, బార్బడోస్
జూన్ 20: ఆస్ట్రేలియా v బంగ్లాదేశ్, నార్త్ సౌండ్, ఆంటిగ్వా
జూన్ 22: భారత్ v బంగ్లాదేశ్, నార్త్ సౌండ్, ఆంటిగ్వా
జూన్ 22: ఆఫ్ఘనిస్తాన్ v ఆస్ట్రేలియా, ఆర్నోస్ వేల్, సెయింట్ విన్సెంట్
జూన్ 24: ఆస్ట్రేలియా v ఇండియా, గ్రాస్ ఐలెట్, సెయింట్ లూసియా
జూన్ 24: ఆఫ్ఘనిస్తాన్ v బంగ్లాదేశ్, ఆర్నోస్ వేల్, సెయింట్ విన్సెంట్
గ్రూప్ 2:
జూన్ 19: యుఎస్‌ఎ v దక్షిణాఫ్రికా, నార్త్ సౌండ్, ఆంటిగ్వా
జూన్ 19: ఇంగ్లండ్ v వెస్టిండీస్, గ్రాస్ ఐలెట్, సెయింట్ లూసియా
జూన్ 21: ఇంగ్లండ్ v సౌతాఫ్రికా, గ్రాస్ ఐలెట్, సెయింట్ లూసియా
జూన్ 21: USA v వెస్టిండీస్, బ్రిడ్జ్‌టౌన్, బార్బడోస్
జూన్ 23: USA v ఇంగ్లాండ్, బ్రిడ్జ్‌టౌన్, బార్బడోస్
జూన్ 23: వెస్టిండీస్ v సౌతాఫ్రికా, నార్త్ సౌండ్, ఆంటిగ్వా
సూపర్ 8 లో భాగంగా 8 జట్లు రెండు గ్రూప్ లుగా విభజించబడతాయి. ప్రతి గ్రూప్ లో నాలుగు జట్లు ఉంటాయి. నాలుగు జట్లు మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. టాప్ 2 లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్ కు వెళ్తాయి. సెమీస్ లో గెలిచిన రెండు జట్లు ఫైనల్ కు అర్హత సాధిస్తాయి. ఫైనల్ జూన్ 29న బార్బడోస్ లో జరుగుతుంది.
T20 World Cup 2024 - Super 8 schedule 🏏🏆 pic.twitter.com/i9JFpY2CGm
— CricketGully (@thecricketgully) June 17, 2024