మామూలుగా గడ్డం పెంచుకుంటే దేవదాసులు.. లవ్ ఫెయిల్యూర్ జీవితంలో ఏదో పోగొట్టుకున్నారని అనుకుంటారు. కానీ బియర్డ్ ఇప్పుడు స్టైలిష్ ట్రెండ్.. టీనేజర్సే కాదు... పెద్దవాళ్లు కూడా గడ్డంతో రకరకాల లుక్స్ కనిపిస్తున్నారు. ఫేస్ షేప్ ని బట్టి బియర్డ్ లుక్‌ని సెట్ చేయిస్తున్నారు. అంతేకాదు గడ్డం అందాన్ని మరింత పెంచుతోంది అనేది వాళ్లమాట. కానీ ఆ బియర్డ్ పెంచడం అంత తేలిక కాదు.బియర్డ్ తో.. పర్ ఫెక్ట్ లుక్ తో స్టైలిష్ గా కనిపించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకొని డిఫరెంట్ బియర్డ్ స్టైల్స్ ని ఫాలో అవ్వాలి. గడ్డం పెంచేందుకు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో తెలుసుకుందాం. . .
గడ్డం పెంచడం గ్లామర్ వరకు ఓకే.. కాని గడ్డంను పెంచిన ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు ట్రిమ్మింగ్ చేసుకుంటూ శుభ్రంగా ఉంచుకోవాలి. లేకపోతే తేమ పెరిగి స్కిన్ ఎలర్జీ, ఇతర చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. జుట్టుకు, శరీరానికి ఎంత జాగ్రత్త తీసుకుంటామో గడ్డం విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉందాలి. చర్మ సంబంధిత సమస్యలు వస్తే వెంటనే డెర్మటాలజిస్టులను కలవాలి. అలాగే సబ్బులతో గద్దాన్ని వాష్ చేయకూడదు.
ALSO READ | Lifestyle: రోజంతా హుషారుగా ఉండాలంటే ఏంచేయాలో తెలుసా..
కష్టమే.. కానీ ఇష్టంగా..
గడ్డం పెంచడం వల్ల వచ్చే అందం సంగతేమో కానీ దాన్ని సరిగా మెయింటెన్ చేయకపోతే మాత్రం అంత బాగుండదు. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వారానికి ఒక సారైనా మైల్డ్ షాంపుతో గడ్డాన్ని వాష్ చేయాలి.. అలాగే గడ్డం వాష్ చేసేటప్పుడు కండీషర్ నీ కూడా వాడాలి. క్రమం తప్పకుండా దువ్వుకోవాలి. గడ్డం అందంగా, ఆకర్షించే రీతిలో ఉండాలంటే జామాయిల్ (యూకలిప్టస్ ఆయిల్) రాసుకోవడం మంచిది. అలాగే. హెయిర్ స్టైల్ లాగానే బియర్డ్స్ కూడా ముఖాకృతిని బట్టి ఉండాలి..
గడ్డం స్టైలిష్ గా ఉండాలంటే ఇవి తినాలి
- చేపల్లో మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. గడ్డానికి పోషణ అందిందే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా వీటి నుండే లభిస్తాయి. గుడ్డులో జింక్, సల్ఫర్, ఐరన్. సెలీనియం లాంటి మూలకాలుంటాయి. ఇవి గడ్డాన్ని ఆరోగ్యంగా ఉంచి త్వరగా పెరిగేలా చేస్తాయి.
- బాదం, వాల్ నట్, జీడిపప్పులో కూడా ఫ్యాటీ ఆమ్లాలుంటాయి. అలాగే వీటిలోని విటమిన్- ఇ. బయోటిన్ లు గడ్డం వెంట్రుకలు రాలడాన్ని తగ్గిస్తాయి.
- ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇవి తింటే గడ్డం ఆరోగ్యంగా పెరుగుతుంది.
- క్యారెట్ ఉండే విటమిన్ -ఎ కూడా గడ్డానికి చాలా మంచిది. అలాగే గ్రీన్ పెప్పర్, బ్రొకోలీలు కూడా గడ్డాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
- అలాగే మీగడ తీసిన పాలు, ఛీజ్. బీన్స్ కూడా వెంట్రుకలు చిట్లి పోనీయవు.
బియర్డ్ కలరింగ్
- గడ్డానికి రంగు వేయాలనుకున్నప్పుడు ముందు ఆ రంగు మీకు సరిపడుతుందో లేదో పరీక్ష చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా రియాక్షన్ వస్తే వాటికి దూరంగా ఉండాలి. బియర్డ్ కలర్స్ ఎంచుకునేటప్పుడు రసాయనాలు ఉన్నవి కాకుండా.. నేచురల్ ప్రొడక్ట్స్ వాడాలి. ఎలాంటి బియర్డ్ అయినా వారానికి ఒకసారి రంగు వేస్తూ పోతే వెంట్రుకలు, కురుకు బలహీనం అవుతాయి. అందుకే మూడు నాలుగు వారాలకు ఒకసారి మాత్రమే వేసుకోవాలి.
- చాలామంది కలర్ వేసుకున్న రెండుమూడు రోజుల్లో రంగు పోతుంది. దాంతో మళ్లీ మళ్లీ వేసుకుంటుంటారు. ఇలా కాకుండా ఉండాలంటే నాణ్యమైన కలర్స్ నే ఎంచుకోవాలి ముఖ్యంగా అమ్మోనియా, సల్ఫేట్ వంటి రసాయనాలు ఉండకూడదు. అంతేకాదు రంగు వేసుకునే ముందు రెండు రోజులు తప్పనిసరిగా మైల్డ్ షాంపూతో గడ్డాన్ని వాష్ చేయాలి. అలాగే నాణ్యమైన కండిషనర్ వాడాలి. ఇలా చేయడం వల్ల గడ్డానికి రంగు బాగా పడుతుంది.
బియర్డ్ ఆయిల్స్
చాలామంది టీనేజర్స్ కి గడ్డం త్వరగా రాదు. వచ్చినా పూర్తిగా రాదు. దాంతో దాన్ని పెంచడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు రేజర్లతో షేవింగ్ చేస్తే బియర్డ్ వస్తుందనే అపోహతో -చేస్తుంటారు కానీ అలా చేయకూడదు. బియర్డ్ వేగంగా, ఆరోగ్యంగా పెరగాలంటే మంచి ఆహారంతో పాటు బియర్డ్ ఆయిల్స్ తో మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గడ్డం వేగంగా, ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాదు లియర్డ్ ఆయిల్స్ మాయిశ్చరైజర్ గా పనిచేసే గడ్డాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
సర్కిల్ బియర్డ్
స్టాండర్డ్ బియర్డ్ గా దీన్ని చెబుతుంటారు. రౌండెడ్ గోత్ డియర్లకు మీసాలు కూడా కలిపిఈ లుక్ తీసుకువస్తారు. అమితాబ్ బచ్చన్ నుంచి శిఖర్ ధావన్ వరకూ చాలామంది.సెలబ్రిటీలు ఈ స్టైల్ అనుసరిస్తుంటారు.
బాల్ఫో
ఈ లుక్ కావాలంటే ముందు గడ్డం ఫుల్ గా పెంచాలి, తరువాత ఈ స్టైల్‌ను ట్రై చేయాలి. ఈ లుక్ కోసం గడ్డంతో తో పాటుగా మీసాలు కూడా పెంచుకోవాలి.
ఇంపీరియల్
దీనినే ఇంగ్లండ్ లుక్ అని కూడా అంటారు. నిజానికిది రెట్రోలుక్. ఇప్పుడు ఫ్రెష్ యూత్ ని ఆకట్టుకుంటోంది. గడ్డంతో సంబంధం లేకుండా మీసం మెలేయడం దీని స్టైల్.
బాల్డ్
ఈ తరహా లుక్ కావడానికి ఓపిక కాస్త ఎక్కువే కావాలి. దీనికోసం కనీసం మూడు నాలుగు నెలలు గడ్డం పెంచాల్సి ఉంటుంది.
–వెలుగు.. లైఫ్–