
న్యూఢిల్లీ: అండర్‌వాల్యూ (షేరు ధర ఉండాల్సిన దానికంటే తక్కువ ఉండడం) షేర్లలో ఇన్వెస్ట్ చేసే వాల్యూ మ్యూచువల్ ఫండ్స్‌కు ఆదరణ పెరుగుతోంది. కిందటేడాది నికరంగా రూ.22,757 కోట్ల పెట్టుబడులు ఈ రకం ఫండ్స్‌లోకి వచ్చాయి. అంతకుముందు ఏడాదిలో వచ్చిన రూ.11,927 కోట్లతో పోలిస్తే రెండింతలు పెరిగాయి. ఇన్వెస్టర్లు ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండి, అండర్‌వాల్యూలో ఉన్న షేర్ల వైపు ఫోకస్ పెడుతున్నారని మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్(యాంఫి) పేర్కొంది. యూటీఐ, యాక్సిస్, క్వాంటమ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, మహీంద్రాలకు చెందిన వాల్యూ ఫండ్‌లు అందుబాటులో ఉన్నాయి.