ఈసారి ఎఫ్​ఎంసీజీ రంగం వృద్ధి 7–-9 శాతం

ఈసారి ఎఫ్​ఎంసీజీ రంగం వృద్ధి 7–-9 శాతం

కోల్‌‌కతా: ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్‌‌ఎమ్‌‌సీజీ) రంగం ఈ ఆర్థిక సంవత్సరంలో 7-–9 శాతం ఆదాయ వృద్ధిని సాధిస్తుందని, క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది.  దీని ప్రకారం...ఈ ఆర్థిక సంవత్సరం (2024-–25)లో  రాబడి పెరుగుదల, గ్రామీణ, పట్టణ డిమాండ్‌‌లో పునరుద్ధరణ నేపథ్యంలో అమ్మకాలు బాగుంటాయి.  

2023–-24లో ఎఫ్​ఎంసీజీ రంగం వృద్ధి 5–-7 శాతంగా అంచనా వేశారు.   ఆహారం,  పానీయాల (ఎఫ్​అండ్​బీ) విభాగానికి సంబంధించిన కీలక ముడి పదార్థాల ధరల్లో స్వల్ప పెరుగుదల వల్ల ఉత్పత్తి  సింగిల్ డిజిట్‌‌లో పెరుగుతుంది. వ్యక్తిగత సంరక్షణ,  గృహ సంరక్షణ విభాగాల ముడి పదార్థాల ధరలు స్థిరంగా ఉండొచ్చు.