
హైదరాబాద్, వెలుగు: క్రిటికల్ కాంపోనెంట్స్ తయారీ కోసం గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ (జీఆర్ఎస్ఈ)తో అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ (ఏఎంఎస్) ఎంఓయూ కుదుర్చుకుంది. అండర్ వాటర్ వెపన్స్, వెహికల్స్, అండర్ వాటర్ మైన్స్, అండర్ వాటర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్నుఇవి కలసి తయారు చేస్తాయి. అంతేగాక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎగుమతి, రక్షణ, రక్షణేతర పరిశ్రమలకు అధునాతన ఆయుధాలు, ఎలక్ట్రానిక్ వ్యవస్థలను సరఫరా చేస్తాయి. ప్రస్తుత సిస్టమ్స్ కూడా అప్గ్రేడ్ చేస్తాయి. ఈ ఒప్పందం ఐదేళ్లపాటు అమల్లో ఉంటుంది.