యాదగిరిగుట్ట ఆలయ స్వర్ణతాపడానికి 10 తులాల బంగారం విరాళం

యాదగిరిగుట్ట ఆలయ స్వర్ణతాపడానికి 10 తులాల బంగారం విరాళం

యాదగిరిగుట్ట, వెలుగు:  లక్ష్మీనరసింహస్వామి గర్భగుడిపై దివ్యవిమాన గోపురానికి ఏర్పాటు చేసే స్వర్ణతాపడం కోసం చెన్నైకి చెందిన జీఆర్టీ గ్రూప్ చైర్మన్ రాజేంద్రన్ 10 తులాల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు.   జీఆర్టీ గ్రూప్ ప్రతినిధులు బుధవారం ఆలయ ఈవో భాస్కర్ రావుకు అందజేశారు.

అనంతరం ప్రధానాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.