మధ్యప్రదేశ్‌లోని కట్నీలో ఓ వ్యక్తి నెమలి ఈకలను తీయడం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోపై స్పందించిన పలువురు యూజర్స్.. నిందితుడిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనలో నిందితుడిని గుర్తించామని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. వైరల్ అవుతోన్న ఈ వీడియోలో కనిపించిన బైక్ నంబర్ ఆధారంగా పోలీసులు యువకుడిని గుర్తించారు. ఇది జిల్లాలోని రీతి పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందినదని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డిఎఫ్‌ఓ) గౌరవ్ శర్మ చెప్పారు.
ఈ వీడియోలో నిందితుడు అతుల్ నెమలి ఈకలను తీస్తున్నట్లు వీడియోలో ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతున్న పాటతో పాటు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే అతుల్‌ను అరెస్ట్ చేసేందుకు అతడి ఇంటికి వెళ్లగా.. ఆ సమయంలో అతను ఇంట్లో లేడని పోలీసులు చెబుతున్నారు.