ఆరు గ్యారెంటీలలో నాలుగు అమలు చేశాం : వివేక్ వెంకటస్వామి

గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ నియంతృత్వ పాలనలో ఉండేదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. నియంతృత్వ పాలనను ప్రజాపాలన చేసి తమ సమస్యలు చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలలో నాలుగు పథకాలు అమలు చేశామని తెలిపారు. జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో వివేక్ వెంకటస్వామితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం వంశీ కృష్ణ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ఇప్పటికే మహిళలు ఫ్రీ బస్సులో ప్రయాణిస్తున్నారని చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షలు, రూ. 500 కే గ్యాస్ సిలిండర్ 200 యూనిట్ల వరకు గృహ జ్యోతి పథకాలు అమలు చేశామన్నారు. త్రాగునీటికి శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే వివేక్ హామీ ఇచ్చారు. 

మరో వారం రోజుల్లో  గృహ లక్ష్మి పథకం అమలు చేస్తామని తెలిపారు. ఇండ్లు లేని నిరుపేదలు గృహ లక్ష్మీ పథకం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి ప్రభుత్వ విప్ పదవి ఇచ్చారని వివేక్ వెంకటస్వామి గుర్తు చేశారు.