
దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ)పై జీఎస్టీ అథారిటీ 36 వేల 884 జరిమానా విధించింది. ఈ విషయాన్ని బీమా కంపెనీ బుధవారం వెల్లడించింది.2023 అక్టోబర్ 9 నాటి స్టేట్ టాక్స్ ఆఫీసర్, శ్రీనగర్ నోటీసు ప్రకారం LIC కొన్ని ఇన్‌వాయిస్‌లపై 18 శాతానికి బదులుగా 12 శాతం GSTని చెల్లించింది. జమ్మూ కాశ్మీర్‌కు వడ్డీ,పెనాల్టీతో పాటు జీఎస్టీ వసూలు కోసం కమ్యూనికేషన్/డిమాండ్ ఆర్డర్‌ను అందుకున్నట్లు ఎల్‌ఐసి స్టాక్ ఎక్స్ఛేంజీకి తెలిపింది.
ALSO READ: భారీగా నగదు పట్టివేత
అంతకుముందు ఎల్‌ఐసికి రూ.84 కోట్ల జరిమానా విధిస్తూ ఆదాయపు పన్ను శాఖ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇది మూడు అసెస్‌మెంట్ సంవత్సరాలలో ఎల్‌ఐసీ చెల్లించని పన్ను మొత్తం. గత వారం (సెప్టెంబర్ 29) ఐటీ నోటీసు అమల్లోకి వచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎల్‌ఐసీ కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. ఎల్‌ఐసీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.