ఈ ఏడాది అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ నవంబర్ 1న విడుదల చేసిన రిపోర్ట్ లో తేలింది. అక్టోబర్‌లో వస్తు, సేవల పన్ను (GST) కలెక్షన్స్ రూ.1.87 లక్షల కోట్లు. వార్షిక వృద్ధి 8.9 శాతం. అయితే ఇది గతేడాది అక్టోబర్ లో రూ.1.72 లక్షల కోట్లుగా ఉంది. CGST, SGST, IGST మరియు సెస్ అక్టోబరులో పెరిగినట్లు ఫైనాన్స్ మినిస్టరీ వెల్లడించిన డేటా ద్వారా తెలుస్తోంది. 2017 జూలై 1 నుంచి ఇండియాలో వస్తు మరియు సేవల పన్ను(GST) అమలులోకి వచ్చింది. అంతకు ముందు వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ (VAT) అమలులో ఉండేది.
ఇప్పటివరకు 2024లో మొత్తం GST వసూళ్లు 9.4 శాతం పెరిగింది. దీంతో రూ.12.74 లక్షల కోట్లకు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ చేరింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మొత్తం GST రూ. 2.10 లక్షల కోట్లు.. రికార్డు స్థాయిలో పెరిగింది. 2023,-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం స్థూల GST వసూళ్లు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 11.7 శాతం పెరుగుదలతో రూ. 20.18 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.