భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. మార్చి నెలలో రూ.1.96 లక్షల కోట్లు

భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. మార్చి నెలలో రూ.1.96 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: జీఎస్టీ వసూళ్ల విలువ గత నెల10 శాతం పెరిగి రూ. 1.96 లక్షల కోట్లకు చేరింది. జీఎస్టీ విధానం మొదలయ్యాక ఇంత భారీగా వసూళ్లు రావడం ఇది రెండోసారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.  దేశీయ లావాదేవీల నుంచి జీఎస్టీ ఆదాయం 8.8 శాతం పెరిగి రూ. 1.49 లక్షల కోట్లకు చేరగా, దిగుమతి చేసుకున్న వస్తువుల నుంచి ఆదాయం 13.56 శాతం పెరిగి రూ. 46,919 కోట్లకు చేరింది.  

మొత్తం వసూళ్లలో రూ. 38,145 కోట్ల సెంట్రల్ జీఎస్టీ , రూ. 49,891 కోట్ల స్టేట్ జీఎస్టీ,  రూ. 95,853 కోట్ల ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ ఉన్నాయి. మార్చిలో సెస్ వసూలు రూ. 12,253 కోట్లుగా ఉంది. మార్చిలో మొత్తం రీఫండ్‌‌లు 41 శాతం పెరిగి రూ. 19,615 కోట్లకు చేరుకున్నాయి.  రీఫండ్‌‌లను సర్దుబాటు చేసిన తర్వాత, నికర జీఎస్టీ ఆదాయం రూ. 1.76 లక్షల కోట్లకు పైగా ఉంది. ఇది ఏడాది క్రితంతో పోలిస్తే 7.3 శాతం పెరిగింది. గత ఏప్రిల్​లో జీఎస్టీ వసూళ్ల విలువ రికార్డు స్థాయిలో రూ. 2.10 లక్షల కోట్లకు చేరుకుంది.