వస్తు సేవల పన్ను (GST) వసూళ్లు రికార్డు సృష్టించాయి. ఏప్రిల్ 2024లో రికార్డు స్థాయిలో రూ.2.10 లక్షల కోట్లకు చేరుకున్నాయి.గతేడాది ఏప్రిల్ తో పోలిస్తే 12.4 శా తం అధికం. లావాదేవీలలో బలమైన పెరుగుదల (13.4 శాతం), దిగుమతులు 8.3 శాతం పెరగడం కారణంగా జీఎస్టీ వసూళ్లలో ఆల్ టైం రికార్డు సృష్టించిందని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది.
ఇందులో సీజీఎస్టీ రూ. 43వేల 846 కోట్లు కాగా.. రాష్ట్ర వస్తు సేవల పన్ను(ఎస్ జీఎస్టీ ) రూ. 53వేల 538 కోట్లుగా ఉంది. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (IGST) మొత్తం రూ. 99వేల 623 కోట్లు, దిగుమతి వస్తువులపై జీఎస్టీ రూ.37వేల 826 కోట్లు ఉన్నాయి. సెస్ ద్వారా 13వేల 260 కోట్లు వచ్చినట్లు కేంద్ర మంత్రి శాఖ తెలిపింది.
మహారాష్ట్ర -13 శాతం..కర్ణాటక 9 శాతం, ఉత్తరప్రదేశ్19 శాతం, గుజరాత్ 13 శాతం, ఢిల్లీలో 23 శాతం జీఎస్టీ వసూళ్లలో వృద్ధి నమోదైంది. అయితే జమ్మూ కాశ్మీర్ -2 శాతం, సిక్కిం -5 శాతం, అరుణాచల్ ప్రదేశ్ -16 శాతం, నాగాలాండ్ -3 శాతం, మేఘాలయ -2 శాతం, లక్షద్వీప్‌లో57 శాతం జిఎస్‌టి వసూళ్లు తగ్గాయి. అండమాన్ , నికోబార్ దీవులు -30 శాతం.